: ‘జంజీర్’ సినిమాను చాలా ఇష్టపడి చేశా: అమితాబ్ బచ్చన్


నాటి ‘జంజీర్’ సినిమా స్టోరీ తనను అమితంగా ఆకట్టుకుందని, ఆ సినిమాను తాను చాలా ఇష్టపడి చేశానని బిగ్ బీ, అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన మొదటి సినిమా పారితోషికం రూ.5 వేలు అని, తన తొలి సినిమా పోస్టర్ చూసినప్పుడు ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు.

తన సోదరుడి సలహా మేరకు సినీ రంగంలోకి రావడం జరిగిందన్నారు. తన సినీ కెరీర్ లో వందల సినిమాలు, వేలాది మంది టెక్నీషియన్స్ తో అనుబంధాలు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. త్వరలో విడుదల కానున్న సర్కార్-3 చిత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించానని, ఈ సినిమాలో తన ఆహార్యం నుంచి డైలాగ్ వరకు క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుందని, ఈ మూవీలో భిన్న కోణాలు ఉన్నాయని అమితాబ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News