: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎండీగా సుబ్రమణియ కుమార్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆర్. సుబ్రమణియకుమార్ నియమితులయ్యారు. ఈ నియమకం తక్షణమే అమల్లోకి వస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడినట్టు పేర్కొంది. కాగా, బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాకు పైగా సుబ్రమణియకుమార్ కు అనుభవం ఉంది. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు విభాగాల్లో ఆయన పని చేశారు. 2016 నుంచి ఐవోబీ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.