: మాజీ సైనికులకు ఇచ్చే నిధుల విడుదలలో జాప్యం వద్దు: గవర్నర్ నరసింహన్
రాజ్ భవన్ లో మాజీ సైనికల పునరావాస ప్రత్యేక నిధి రాష్ట్ర పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నరసింహన్ అధ్యక్షత వహించారు. మాజీ సైనికులకు ఇచ్చే నిధుల విడుదలలో ఆలస్యం జరగకూడదన్నారు. ఆ నిధుల విడుదలలో ఆలస్యం జరిగితే తన దృష్టికి తీసుకురావాలని, మాజీ సైనికులకు ప్రయోజనాలు, నిధులను, పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ వేసినట్టు చెప్పారు.