: కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచడానికి.. లాడెన్ నుంచి డబ్బు తీసుకున్న నవాజ్ షరీఫ్: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై పాక్ మాజీ క్రికెట్ కెప్టెన్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్ లలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి షరీఫ్ 'ఆల్ ఖైదా' అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు. మొత్తంమీద 1.5 బిలియన్ డాలర్ల లంచాన్ని షరీఫ్ తీసుకున్నాడని తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ రాజీనామా కోసం గత కొంత కాలంగా ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు.