: కేసీఆర్ ప్రభుత్వం దారి తప్పింది.. కేంద్రానికి లేఖ రాస్తా: కిషన్ రెడ్డి


తెలంగాణలో పాలన గాడితప్పిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. దారితప్పిన ప్రభుత్వాన్ని హెచ్చరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ప్రగతి భవన్ లో ఇచ్చే ఉపన్యాసాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. లేనిపోని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట మున్సిపల్ ఛైర్మన్ పై వివక్ష మంచిది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News