: దిగజారుడు రాజకీయాలకు పాల్పడే ప్రతిపక్షనేత జగన్: మంత్రి దేవినేని
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి దేవినేని ఉమ మరోమారు మండిపడ్డారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు విదేశాలకు వెళ్లి కష్టపడుతుంటే, తప్పుడు ఈ-మెయిల్స్ పంపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ఇలాంటి ప్రతిపక్ష నేతను తాను ఎక్కడా చూడలేదని, భవిష్యత్ లో జగన్ ప్రతిపక్షంలో కూడా ఉండరని జోస్యం చెప్పారు. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు అమెరికాలో అవార్డు అందుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు.