: నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న పవన్ కల్యాణ్?
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడనేదే ఆ వార్త. రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్న తర్వాత వీరికి అకీరా, ఆద్య అనే పిల్లలు జన్మించారు. ఆ తర్వాత రేణు దేశాయ్, పవన్ ఇద్దరూ విడిపోయారు. అనంతరం రష్యాకు చెందిన అన్నా లెజీనావోను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పొలేనా అనే పాప జన్మించింది. ఈ మధ్యనే పవన్ శ్రీమతి అన్నా ఓ షాపింగ్ మాల్ లో కనిపించింది. ఆమె బేబీ బంప్ (లావు పొట్ట)తో కనిపించిందట. దీంతో, పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త షికారు చేస్తోంది. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.