: కాకినాడలో మహిళా ఉద్యోగి కిడ్నాప్ నకు విఫలయత్నం!


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. షిప్ యార్డులో పని చేసే ఓ మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు దుండగులు యత్నించారు. ఆమెను కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, స్థానికులు అడ్డుకోవడంతో కిడ్నాపర్లు తోకముడిచారు. నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News