: ఏసీబీ వలలో ఆంధ్రా అధికారి!
ఏసీబీ వలకు ఏపీ ప్రభుత్వ అధికారి సాయికుమార్ (57) చిక్కారు. ఏసీబీ డీజీ ఆర్.పి. ఠాకూర్ పర్యవేక్షణలో ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న ఆయన నివాసం సహా ఎనిమిది చోట్ల ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు నిర్వహించారు. కడప, గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, బెంగళూరులోని సాయికుమార్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయల నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.