: ఐపీఎల్ టాప్ స్కోరర్లను పక్కనబెట్టిన బీసీసీఐపై నెట్టింట విమర్శల వెల్లువ
ఈ ఉదయం సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ టీమ్, వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్ లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించగా, ఈ ఐపీఎల్ సీజన్ లో టాప్ స్కోరర్లుగా నిలిచిన వారిని పక్కన బెట్టడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఐపీఎల్ పదో సీజన్ లో 12 మ్యాచ్ ల చొప్పున ఆడిన రైనా 434 పరుగులు, గంభీర్ 425 పరుగులు, 10 మ్యాచ్ లు ఆడిన ఉతప్ప 384 పరుగులు చేశారు. యువ సంచలనం త్రిపాఠి 353 పరుగులు చేయగా చాంపియన్స్ ట్రోఫీకి వీరినెవరినీ ఎంపిక చేయలేదు. వాస్తవానికి గంభీర్ ను, రైనాను ఇంగ్లండ్ పంపుతారని అభిమానులు ఎదురుచూడగా, వారికి ప్రాబబుల్స్ జాబితాలో స్థానం దక్కలేదు. భారత్ తరఫున ఐపీఎల్ లో టాప్ స్కోరర్లుగా నిలిచిన రైనా, గంభీర్ లను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.