: కేజ్రీపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో ఏసీబీ ఆఫీసుకు వెళ్లిన కపిల్ మిశ్రా!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తన కళ్లముందే రూ. 2 కోట్ల లంచాన్ని సత్యేంద్ర జైన్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేసిన బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా, ఈ ఉదయం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి తన వద్ద ఉన్న ఆధారాలు అందించారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ పై తన ఆరోపణల్లో నిజాన్ని తేల్చేందుకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా కేజ్రీవాల్ ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించిన ఆయన, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. కాగా, కపిల్ మిశ్రా ఆరోపణలపై స్పందించేందుకు కేజ్రీవాల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం సిసోడియా మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.