: పవన్ కల్యాణ్ సైలెన్స్ పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారి


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం నియమించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ నియామకానికి సంబంధించి దక్షణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి దీనిపై మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని అన్నారు.

ఈ విషయంపై పవన్ ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ఉత్తరాదికి చెందిన అధికారికి ఈ పదవిని కట్టబెట్టడంపై దక్షిణాది ఐఏఎస్ లు అసంతృప్తితో ఉన్నారని... దీనిపై జనసేనాని స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక విషయాల పట్ల పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్నారని... అదే విధంగా ఈ విషయంపై కూడా ఆయన ప్రశ్నించాలని కోరారు.



  • Loading...

More Telugu News