: ఆమె నటించి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ పేరు వచ్చి ఉండేది: రామ్ గోపాల్ వర్మ
రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి-2' రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అత్యంత కీలకమైన శివగామి పాత్రను పోషించేందుకు తొలుత అతిలోకసుందరి శ్రీదేవిని దర్శకనిర్మాతలు సంప్రదించారు. కానీ, కొన్ని కారణాల రీత్యా వీరి ఆఫర్ ను శ్రీదేవి తిరస్కరించింది. దీనిపై ప్రముఖ సినీ దర్శకుడు, శ్రీదేవి వీరాభిమాని రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
ఈ సినిమాలో శ్రీదేవి నటించకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వర్మ తెలిపాడు. ఆమె నటించి ఉంటే... ఆమె కెరియర్లోనే అత్యద్భుతమైన చిత్రంగా ఇది మిగిలిపోయేదని చెప్పాడు. ప్రభాస్ కంటే కూడా శ్రీదేవికే ఎక్కువ పేరు వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డాడు.