: తొలిసారి అంతర్జాతీయ స్టార్ ను ఇంటర్వ్యూ చేయనున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ తొలిసారి అంతర్జాతీయ స్టార్ ను ఇంటర్వ్యూ చేయనున్నాడు. స్టార్ ఛానెల్ లో కాఫీ విత్ కరణ్ అనే షో నిర్వహించే కరణ్ జోహర్... తొలిసారి తన టాక్ షోలో పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ను ఇంటర్వ్యూ చేయనున్నాడు. ఈ మేరకు కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ షో టీమ్ ప్రకటించింది. ఈనెల 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో షో నిర్వంచిన రోజే ఆయన ఈ షోలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. షో అయిపోయిన తరువాత బీబర్ ఇంటర్వ్యూ ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లను ఇంటర్వ్యూ చేసే కరణ్ జోహర్... ఈ షోతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఐదు సీజన్లు నిర్వహించిన కరణ్ జోహర్...తాజాగా ఆరో సీజన్ ప్రారంభించాడు. బాహుబలి విజయంతో ఆనందంలో ఉన్న కరణ్..బీబర్ ను ఇంటర్వ్యూ చేయడంపై ఉత్సాహంగా ఉన్నాడు. 

  • Loading...

More Telugu News