: ఇది జగన్ మీడియా దుర్మార్గం.. మనుగడ ఉండదనే విధ్వంసకర రాజకీయాలు.. జగన్‌పై సోమిరెడ్డి నిప్పులు

అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ వైసీపీ మద్దతుదారులు ఇర్వింగ్ మేయర్‌కు ఈ-మెుయిల్స్ పంపడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశాల్లో ఏపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జగన్ మీడియా బృందం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల వరకు రాజకీయాలు మామూలే కానీ, రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న పర్యటనపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం తగదని జగన్‌కు హితవు పలికారు.

అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ప్రవాసాంధ్రులు బ్రహ్మరథం పట్టడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఈ దుష్ప్రచారానికి దిగారని ధ్వజమెత్తారు. జగన్ విధ్వంసకర రాజకీయాలకు ఇదో మచ్చుతునక అని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తే వైసీపీకి మనుగడ ఉండదని భావించే జగన్ తన మద్దతుదారులలో ఇలాంటి కుట్రలు చేయిస్తున్నారని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.

More Telugu News