: సునీల్ నరైన్ వీర విజృంభణ.. 15 బంతుల్లో అర్ధశతకం బాదిన కోల్‌కతా ఓపెనర్


ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ విశ్వరూపం ప్రదర్శించాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సమం చేశాడు. గతంలో కూడా కోల్‌కతా ఆటగాడే అయిన యూసుఫ్ పఠాన్ కూడా 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు.

మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న నరైన్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. బద్రీ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 4, 2, 1 పరుగులు పిండుకున్న నరైన్, తర్వాత అరవింద్ వేసిన ఓవర్లో 2, 4, 4, 4, 6 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మరో ఓపెనర్ క్రిస్ లిన్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News