: రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే వస్తానేమో!: రమ్యకృష్ణ
ప్రముఖ నటి రమ్యకృష్ణ ను ‘మీరు రాజకీయాల్లోకి వస్తారా?’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందని నా అభిప్రాయం. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని రాసి పెట్టి ఉంటే వస్తానేమో. అయితే, రాజకీయాల్లోకి రాకుండా కూడా మంచి పనులు చేయొచ్చు. ఒకవేళ, నేను రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని రాసి పెట్టి ఉంటే, వస్తానేమో!’ అని సమాధానమిచ్చింది. కాగా, ‘బాహుబలి’లో శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి.