: ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత... నిరసనకారుల దాడిలో ఎస్పీ, ఏఎస్పీలకు గాయాలు
ఆదిలాబాద్ సమీపంలోని ఉట్నూరులో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం తీవ్ర రూపం దాల్చగా, పరస్పరం రాళ్ల దాడికి దిగిన ఘటనలో అడ్డుకోబోయిన పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను రప్పించగా, విషయం తెలుసుకున్న నిరసనకారులు ఉట్నూరు పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించారు. ఈ సమయంలో పోలీసులు సైతం లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులు విసిరిన రాళ్లతో ఎస్పీ, ఏఎస్పీ సహా 10 మంది పోలీసులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. స్టేషన్ పై దాడికి దిగిన వారిని గుర్తించి వారిపై కేసులను నమోదు చేస్తామని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సివుంది.