: కాశ్మీర్ లో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు... ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరుల మృతి


జమ్మూ కాశ్మీర్ పరిధిలోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్తంభించిన ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్న పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై మీర్ బజార్ ప్రాంతంలో ఓ యాక్సిడెంట్ జరుగగా, ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి.

దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేశారని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారని, పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా, మిగతా ఇద్దరు పారిపోయారని తెలిపారు. వారిలో ఒకరికి బులెట్ గాయమైనట్టు సమాచారం ఉండటంతో, సమీపంలోని ఆసుపత్రుల్లో సోదాలు జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News