: రూ. 500 కోట్లు ఇవ్వకుంటే రసాయన దాడి చేస్తాం: విప్రోకు బెదిరింపు


ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో యాజమాన్యం తక్షణమే రూ. 500 కోట్లు చెల్లించాలని లేకుంటే ఆ సంస్థ బెంగళూరులో నిర్వహిస్తున్న కార్యాలయంపై రసాయన దాడి చేస్తామని ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ నెల 25లోగా తామడిగిన డబ్బు ఇవ్వాలని, ఇదేమీ ఉత్తుత్తి మెయిల్ కాదని, ఇప్పటికే రసాయనాలను సంస్థలోకి తరలించామని కూడా అందులో ఉంది. దీంతో ఉలిక్కిపడిన విప్రో యాజమాన్యం పోలీసులను ఆశ్రయించగా, రమేష్ అనే వ్యక్తి నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.

రెజిన్ అనే విషపూరిత రసాయనాన్ని విప్రోలో పెద్దఎత్తున ఉంచామని సదరు మెయిల్ లో ఉండటంతో విప్రో కార్యాలయాలు అన్నిట్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇది నిజంగానే విద్రోహుల బెదిరింపా? లేక సంస్థలోనే ఎవరైనా చేశారా? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాఫ్తు సాగుతోంది.

  • Loading...

More Telugu News