: కూతుళ్లకు విషమిచ్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. కత్తిపూడిలో విషాద ఘటన!


తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. జిల్లాలోని శంఖవ‌రం మండలం క‌త్తిపూడి గ్రామంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... స‌త్యనారాయ‌ణ(32) ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వ్యాపారంలో న‌ష్టాలు రావ‌డంతో అధికంగా అప్పులు చేశాడు. ఆ అప్పులు తిరిగి తీర్చ‌లేని స్థితిలో ఉండ‌డంతో ఆయ‌న కుమిలిపోయేవాడు.

ఈ నేపథ్యంలో అప్పుల బాధ తాళ‌లేక త‌న భార్య పూర్ణిమ‌(25)తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. వారికి వినీశ‌ (4), త‌న్వీ(2) అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. తాము లేనిదే వారు బ‌త‌క‌లేర‌ని భావించి, ముందుగా వారికి విష‌మిచ్చి చంపేసిన ఆ దంప‌తులు... ఆ త‌రువాత వారు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News