: కశ్మీర్ అల్లరిమూకలను ఎదుర్కొనేందుకు తరలి వెళ్తున్న 'కాన్పూర్ జనసేన' సైన్యం
అల్లరిమూకల దాడులతో కశ్మీర్ నిత్యం ఉద్రిక్తంగానే ఉంటోంది. వేర్పాటువాదులిచ్చే కిరాయి తీసుకుని సైన్యంపై రాళ్లు రువ్వే ఘటనలు అక్కడ సర్వసాధారణం అయ్యాయి. వీరిని తరిమి కొట్టేందుకు సైనికులు పెల్లెట్ గన్స్ వాడుతున్నారు. అయినా అక్కడి యువత ఏ మాత్రం తగ్గకుండా, సైన్యంపై రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాన్పూర్ కు చెందిన జనసేన సంస్థ ఓ సైన్యాన్ని తయారు చేసింది.
ఈ సైన్యంలో సాధువులు రాళ్లు రువ్వడంలో శిక్షణ పొందుతున్నారు. వీరిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. కశ్మీర్ లో సైన్యంపై రాళ్లు రువ్వుతున్న యువతను అడ్డుకునేందుకునే వీరు ట్రైనింగ్ పొందుతున్నారు. రేపు ఈ సైన్యానికి చెందిన వేలాది మంది కశ్మీర్ కు వెళుతున్నారు. రాళ్లు రువ్వుతూ, దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న అక్కడి అల్లరిమూకలకు గట్టి గుణపాఠం నేర్పుతామని వీరు చెబుతున్నారు. మరి వీరి యత్నాలు ఎంతమేర ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.