: అమెరికాలో కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఉద్యోగాల నియామకం పెరిగిపోతూ వస్తోంది. గత నెలలో అమెరికా కంపెనీలు 2,11,000 ఉద్యోగాలను పెంచుకోవడమే ఇందుకు నిదర్శనం. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో నమోదైన ఆర్థిక వ్యవస్థ పతనం తాత్కాలికమేనని ఈ డేటా ద్వారా తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ పాలనలో అమెరికా నిరుద్యోగిత రేటు సైతం 4.4 శాతానికి పడిపోయిందని, గత పదేళ్ల కాలంలో ఇదే అత్యంత కనిష్టమని లేబర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. గతంలో నెలకు సగటున 1,85,000 ఉద్యోగాలను మాత్రమే కంపెనీలు ఏర్పాటుచేసేవని, ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు పెరిగిపోయానని తెలిపింది. కాగా, అమెరికాలో సగటున చెల్లించే చెల్లింపులు మెల్లిగా పెరుగుతున్నాయని పేర్కొంది. సంవత్సర కాలంలో పేచెక్స్ 2.5 శాతమే పెరిగాయని వెల్లడించింది.