: కాలినడకన తిరుమలకు వెళ్లిన టీటీడీ కొత్త ఈవో !
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. అనంతరం, స్వావిు వారికి తలనీలాలు సమర్పించారు. నడకదారి భక్తుల క్యూలో వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ ప్రస్తుత ఈవో సాంబశివరావు నుంచి రేపు ఉదయం అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన వ్యక్తిని నియమించడం ఇదే తొలిసారి. అంతకుముందు, ఢిల్లీ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు ఘనస్వాగతం పలికారు.