: నాడు సచిన్ కు తొలి బ్యాట్ ను కానుకగా ఇచ్చిన ఘనత ఆమెదే!


ప్రపంచ ఖ్యాతిని పొందిన క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత రవి భాగ్ చంద్కా ఓ ఇంటర్వ్యూలో సచిన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. నాడు సచిన్ కు తొలి బ్యాట్ ను కానుకగా అందించిన వ్యక్తి ఆయన సోదరి సవిత అని, ఈ విషయాన్ని సచిన్ తనతో చెప్పాడని అన్నారు. ఈ బ్యాట్ ని ప్రత్యేకంగా కాశ్మీర్లో తయారు చేయించిందని చెప్పాడన్నారు.

  • Loading...

More Telugu News