: ‘బాహుబలి 2’ తొలి వారం కలెక్షన్ల వివరాలు!


ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుద‌లై వారం రోజులు అవుతున్న సంద‌ర్భంగా ఇప్ప‌టివ‌ర‌కు ఏయే భాష‌ల్లో ఎంత వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద‌నే విష‌యాన్ని సినీ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ వివ‌రించారు. ఇండియాలో విడుద‌లైన అన్ని భాష‌ల్లో క‌లిపి వారం రోజుల్లో బాహుబ‌లి రూ. 534 కోట్లు వసూలు చేసింద‌ని, దీంతో తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన భార‌తీయ సినిమాగా నిలిచిందని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అని నిస్సందేహంగా చెప్ప‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. హిందీలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన దంగ‌ల్‌, సుల్తాన్ సినిమాల‌తో ఈ సినిమాను పోల్చుతూ ఆయ‌న ప‌లు వివ‌రాలు తెలిపారు.
 
ఆయ‌న పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం..
‘దంగల్‌’ తొలివారం క‌లెక్ష‌న్లు రూ. 197.54 కోట్లు
 ‘సుల్తాన్‌’ తొమ్మిది రోజుల కలెక్ష‌న్లు రూ. 229.16 కోట్లు
 ‘బాహుబలి 2’ ఏడు రోజుల క‌లెక్ష‌న్లు రూ. 247 కోట్లు

 ఒక్క హిందీ భాష‌లో ఈ తొలి ఏడు రోజుల్లో ‘బాహుబలి 2’ రాబ‌ట్టిన వ‌సూళ్లు..
గ‌త శుక్రవారం రూ. 41 కోట్లు
 శనివారం రూ. 40.50 కోట్లు
 ఆదివారం రూ. 46.50 కోట్లు
 సోమవారం రూ. 40.25
 మంగళవారం రూ. 30 కోట్లు
 బుధవారం రూ. 26 కోట్లు
 గురువారం రూ. 22.75 కోట్లు



  • Loading...

More Telugu News