: మా బిడ్డ బతికుంటే 29 లోకి అడుగుపెట్టి ఉండేది.. కన్నీటి పర్యంతమైన నిర్భయ తల్లి


తమ బిడ్డ బతికుండి ఉంటే 29వ పడిలోకి అడుగు పెట్టి ఉండేదంటూ నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ‘నిర్భయ’ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారైన అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘మా బిడ్డ జ్యోతి పుట్టినరోజు మే 10. ఆమె బతికుండి ఉంటే 29వ సంత్సరంలోకి అడుగుపెట్టి ఉండేది’ అంటూ వాపోయారు. కాగా, నేటి తీర్పు తమ కుటుంబానికి దక్కిన విజయమని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ అన్నారు. అనంతరం, ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ మాట్లాడుతూ, అత్యాచార ఘటనల్లో సిగ్గు పడాల్సింది మహిళలు కాదని, రేపిస్టులని అన్నారు. ఆశాదేవి కోరినట్టే .. ఇకపై నిర్భయను జ్యోతి అనే పిలుద్దామని అన్నారు. ఈ కేసులో తీర్పుపై కేంద్ర మంత్రి మేనకాగాంధీ స్పందిస్తూ.. ఈ తీర్పు విన్నాక సంతోషపడ్డానని అన్నారు.

  • Loading...

More Telugu News