: రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నాలను తీవ్రతరం చేసిన ద్రౌపతి ముర్ము

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 25తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించాయి. ఎన్టీయే కూటమి నుంచి రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల సంఖ్య కూడా బాగానే ఉంది.

తాజాగా ఎన్డీఏ తరపున ఈ పదవి కోసం జార్ఖండ్ గవర్నర్ ద్రౌపతి ముర్ము పేరు బాగా వినిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మహిళ కావడంతో ఈమెకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, కలసి వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆమె కూడా తనవైపు నుంచి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 2015 మే 18 నుంచి ఆమె జార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఆమె చరిత్ర సృష్టించారు.

More Telugu News