: ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద బీజేపీ నేత కిషన్ రెడ్డి అరెస్టు
తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చికి మద్దతు ధర కోసం గతవారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు సంఘీభావం తెలిపి, వారి మనోభావాలు తెలుసుకునేందుకు కిషన్ రెడ్డి ఖమ్మం మార్కెట్ యార్డుకు బయల్దేరారు. అయితే మార్కెట్ యార్డు పరిసరాల్లో ఉన్న పోలీసులు, ఆయనను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆయన పోలీసులను నిలదీశారు.