: పీవీ సింధుకు వెయ్యి గజాల స్థలం కేటాయింపు


ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పివి సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినందుకు కానుకగా ఈ భూమిని కేటాయించింది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన పత్రాలను ఈ రోజు సింధుకు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సింధు, ఆమె తల్లిదండ్రులు తమ ధన్యవాదాలు తెలిపారు. కాగా, నగరంలో ఇంటి నిర్మాణం నిమిత్తం సింధుకు భూమిని ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News