: మద్రాసు హైకోర్టులో కమలహాసన్ కు ఊరట!


మహాభారతాన్ని అవమానిస్తూ ప్రముఖ నటుడు కమలహాసన్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై కింది కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలవడం, ఆయనకు సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ పిటిషన్లను సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కమల్ కు ఊరట లభించింది. కింది కోర్టులు ఇచ్చిన సమన్లపై హైకోర్టు స్టే విధించింది. కాగా, మహాభారతాన్ని తాను అవమానపరచలేదని, ఎవరినీ కించపరచలేదని కమల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కింది కోర్టులు జారీ చేసిన సమన్లపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News