: అంత సోయి కేంద్ర ప్రభుత్వానికి లేదు: హరీష్ రావు


కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మొత్తం 7 లక్షల టన్నుల మిర్చి పండితే... కేవలం 33 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తారా? అని ఆయన నిలదీశారు. మిర్చికి సరైన మద్దతు ధర చెల్లించాలన్న సోయి కూడా కేంద్రానికి లేదని మండిపడ్డారు. క్వింటా మిర్చికి రూ. 10 వేల ధర చెల్లించాలంటూ మార్కెట్లలో తిరుగుతూ బీజేపీ నేతలు మాటలు చెబుతుంటారని... కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ. 5 వేలకే కొంటామని చెబుతోందని అన్నారు. మిర్చి కొనుగోళ్లపై తమకు పూర్తి స్పష్టత ఉందని... బీజేపీకే లేదని చెప్పారు. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నేతలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని అన్నారు. మిర్చి రైతులకు న్యాయం జరిగేందుకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News