: సహనటుడితో మరాఠీ టీవీ నటి ఎంగేజ్ మెంట్


మరాఠి టీవీ నటి కుష్బూ తావ్డేకు, తన సహ నటుడు సంగ్రామ్ సాల్వితో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన వారితో పాటు, సన్నిహితులు, టీవీ నటులు హాజరయ్యారు. కాగా, పలు హిందీ, మరాఠీ సీరియల్స్ లో కుష్బూ నటించింది. ‘సబ్’ టీవీలో ప్రసారమయ్యే ‘తారక్ మెహతా ఉల్టా చష్మా’ సీరియల్, ‘తేరే బిన్’ అనే మరో సీరియల్ లోను ఆమె నటించింది. కాగా, ఇటీవల వారి ఎంగేజ్ మెంట్ జరిగిన అనంతరం, నటుడు సంగ్రామ్ సాల్వి తమ ఫొటోను ‘ఇన్ స్టాగ్రామ్’లో పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News