: లండన్ లో హోటల్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్న హీరోయిన్
రెస్టారెంట్ వ్యాపారంలో మరో హీరోయిన్ అడుగుపెడుతోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు రియల్ ఎస్టేట్, లేదా, బంగారు, వజ్రాభరణాలు కొనుగోలు చేయడం చేస్తుంటారు. క్రికెటర్లు ఫిటె నెస్ సెంటర్లు, రెస్టారెంట్ బిజినెస్ లో పెట్టుబడులు పెడుతుంటారు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న అమీ జాక్సన్ లండన్ లో హోటల్ ప్రారంభించే ఆలోచనలో ఉంది. తన తల్లిని భాగస్వామిగా చేసుకుని ఈ వ్యాపారంలో దూసుకుపోవాలని భావిస్తోంది. షూటింగ్ లేకపోతే వంట చేయడం అమీ జాక్సన్ హాబీ అని, దీంతోనే ఆమె రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెడుతోందని తెలుస్తోంది.