: ప్రదీప్ ఆత్మహత్యలో పలు అనుమానాలు... శవం మంచం కింద ఎందుకుంది?
టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మహత్యపై అతని స్నేహితులు పలు అనుమానాలు వక్తం చేస్తుండడంతో క్లూస్ టీం రంగంలోకి దిగి, పలు వివరాలు సేకరించింది. అయితే ప్రదీప్ స్నేహితులు మాత్రం అది ఆత్మహత్య కాదని... వివరాలు చూస్తుంటే... మర్డర్ అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొన్న రాత్రి పావని స్నేహితుడు శ్రావణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. వైజాగ్ కు చెందిన శ్రావణ్... దుబాయ్ నుంచి వచ్చిన తరువాత వీరింట్లో ఎందుకున్నాడు?... పావని అతనిని కజిన్ అని చెబుతుండగా... అతను బంధువే కాదని ప్రదీప్ కుటుంబం చెబుతోంది. పార్టీ 1:30 నిమిషాలకు పూర్తి కాగా, 4:30 వరకు డిష్కషన్ జరిగితే శ్రావణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?... అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క పావని సెల్ ఫోన్ లో పెట్టుకున్న ప్రొఫైల్ పిక్ గురించి ప్రదీప్ ప్రశ్నించాడని చెప్పారు.
దుబాయ్ నుంచి మూడు నెలల క్రితం వచ్చిన శ్రావణ్... వారింట్లోనే మకాం వేశాడని వారు చెప్పారు. అతనితో చనువుగా ఉన్న ఫోటోను పావని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై ప్రదీప్ మండిపడ్డాడని తెలిపారు. అతని తలపగలడం... ఒక ఎత్తైతే... ప్రదీప్ శవం మంచం కింద ఎలా ఉందన్న అనుమానం వస్తోంది. ఇవన్నీ ప్రదీప్ ది ఆత్మహత్య కాదు శ్రావణ్, పావని కలిసి ప్రదీప్ ను హత్య చేసి ఉంటారన్న అనుమానం రేపుతున్నాయని వారు తెలిపారు. కాగా, నేడు ప్రదీప్ అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టు మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత ఈ మర్డర్ మిస్టరీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.