: శ్రవణ్ తో సంబంధమా? సిల్లీ ప్రశ్న: ఆత్మహత్య చేసుకున్న నటుడు ప్రదీప్ భార్య పావని రెడ్డి

పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ, మెప్పిస్తున్న యువ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై ఆయన భార్య నటి పావని రెడ్డి మీడియాతో మాట్లాడింది. తమ ఇంట్లో శ్రవణ్ ఉండటానికి, భర్త ఆత్మహత్యకూ సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. శ్రవణ్ తో తనకు సంబంధముందన్న ప్రశ్నే సిల్లీదని, అసలటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ శ్రవణ్ తో తనకు సంబంధమే ఉంటే, మూడు నెలల నుంచి అతన్ని ఇంట్లో ఉంచేందుకు ప్రదీప్ అంగీకరించేవాడా? అని ప్రశ్నించింది.

శ్రవణ్, తను బ్రదర్ అండ్ సిస్టర్ లాంటి వారమని చెప్పింది. చాలా చిన్న విషయానికి తాను మామూలుగా అలిగి వెళ్లిపోయానని, అతిగా తాగిన మైకంలో ప్రదీప్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, ఇది ముందుగా ప్లాన్ చేసుకుంది కాదని అనిపిస్తోందని పేర్కొంది. కాగా, ఈ కేసులో పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు. నేడు ప్రదీప్ అంత్యక్రియలు జరగనుండగా, అవి ముగిసిన వెంటనే శ్రవణ్, పావనిలను ఇంటరాగేషన్ కు పిలిచే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News