: దేశాధ్యక్షుడా? గాయకుడా?... ఇండియా టూర్ లో ఆ పాప్ స్టార్ కోరికల లిస్టు ఇదిగో!


కెనడాకు చెందిన యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఈ నెల 10వ తేదీన భారత్ రానున్నాడు. జస్టిస్ డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించనున్న షోలో పాల్గొంటాడు. ఈ షోలో పాల్గొనేందుకు, అభిమానులతో ముచ్చటించేందుకు, ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు.. ఇలా రకరకాల రూపంలో భారీ ఎత్తున పారితోషికం వసూలు చేస్తున్నాడు. అయితే, బీబర్ భారత పర్యటన సందర్భంగా నిర్వాహకులను కోరిన కోరికల లిస్టు వింటే ఎవరైనా బెంబేలెత్తిపోవాల్సిందే....ఈ లిస్టు విన్న సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం...అతనిపై సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకీ బీబర్ ఈ టూర్ కోసం ఏం కోరికలు కోరాడో తెలుసా?... మ్యూజిక్‌ జర్నలిస్ట్‌ అర్జున్‌ రవి తెలిపిన వివరాల ప్రకారం.... మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది పోలీస్‌ సెక్యూరిటీ సిబ్బంది, సోఫా సెట్‌, వాషింగ్‌ మెషీన్‌, రిఫ్రిజిరేటర్‌, మసాజ్‌ టేబుల్‌ జాకుజ్జి (చిన్న ఈతకొలను లాంటిది), తనతో పాటు తన స్టాఫ్ కు కలిపి రెండు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలోని మొత్తం రూములు బుక్ చేశారు. అందులో బీబర్ కోసం 1000 చదరపు అడుగుల సూట్‌ ను అతనికి ఇష్టమైన పర్పుల్ కలర్ లో ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు బీబర్‌ కోరుకున్నది వండిపెట్టేందుకు ప్రముఖ చెఫ్‌ లు సిద్ధంగా వుండాలి. ఆ చెఫ్ లు ఈ నాలుగు రోజుల్లో రోజుకు ఐదు ఫేమస్‌ వంటకాలు చేసిపెట్టాలి. ఆ వంటకాలకు బీబర్‌ పాడిన పాటల పేర్లు పెట్టాలన్నది షరతు.

కేరళకు చెందిన ప్రముఖ మసాజ్‌ నిపుణులను రప్పించారు. ఈ నాలుగు రోజులు బీబర్ కోరుకున్నప్పుడు వారు మసాజ్ చెయ్యాలి. బీబర్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్లాలంటే... ఓ ప్రైవేట్‌ జెట్‌, చాపర్‌ సిద్ధంగా వుండాలి. బీబర్‌ కోసం ఏర్పాటు చేసిన పర్పుల్ కలర్ సూట్ లో మొత్తం తెల్లటి కర్టెన్లు, 24 నీళ్ల బాటిళ్లు, 24 ఆల్కలైన్‌ బాటిళ్లు, 4 ఎనర్జీ డ్రింక్స్‌, ఆరు విటమిన్‌ బాటిళ్లు ఉండాలి. బీబర్ పరిసరాల్లో లిల్లీ పూలు కనిపించకూడదు... బీబర్ కి అవంటే ఇష్టం ఉండదు. ఈ కోరికలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బీబర్ పాప్ సింగరా? లేక ఏదైనా దేశాధ్యక్షుడా? అని ఆశ్చర్యపోతున్నారు. అతని గొంతెమ్మ కోరికలపై తెగ కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News