: సమంత పంచెకట్టి..నవ్వులు చిందిస్తే ఇలా ఉంటుంది!
దక్షిణాది నటి సమంత పంచెకట్టి..నవ్వులు చిందిస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ ఫొటోలో సమంత ఒక్కతే కాకుండా, క్యారెక్టర్ నటుడు రావు రమేశ్ కూడా ఉన్నాడు. పంచెకట్టులో, భుజాన కండువా వేసుకుని, జేబులో పెన్ను పెట్టుకుని, చేతికి వాచీ ధరించి ఉన్న వీళ్లిద్దరూ పక్కపక్కనే నిలబడి నవ్వులు చిందిస్తూ..ఫొటోకు పోజు ఇచ్చారు. అయితే, ఏ సందర్భంలో ఈ ఫొటోలు దిగారనే విషయం తెలియదు.కాగా, ‘రాజుగారి గది 2’ చిత్రంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.