: నాలుగో నంబర్ సెల్ లో ఒంటరిగా శశికళ!

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను వేరే సెల్ లోకి మార్చారు. తన మరదలు ఇళవరిసితో కలసి తాను ఒకే సెల్ లో ఉండలేనని ఆమె చెప్పడంతో... జైలు అధికారులు ఆమెను నాలుగో నంబర్ సెల్ కు మార్చారు. ఈ సెల్ లో ఆమె ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు తనను చూడటానికి వస్తున్న బంధువులందరినీ ఆమె కలవడం లేదు. కేవలం కొంతమందితోనే కలుస్తున్నారు. జైలుకు వస్తున్న బంధువులు తన యోగ క్షేమాలను విచారించకుండా... తమ పేర ఆస్తులు రాయించాలంటూ ఒత్తిడి తీసుకొస్తుండటమే దీనికి కారణం. 

More Telugu News