: మరుగుదొడ్లకు బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ కుమార్!


సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేస్తున్న అక్షయ్... ఇప్పుడు మరో కార్యక్రమానికి తనవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో బహిరంగ మూత్ర, మల విసర్జన సమస్యను అధిగమించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఓ ఆలోచనతో ముందుకు వచ్చారు. ముంబైలో ప్రతి అర కిలోమీటర్ కు ఒక టాయ్ లెట్ ఉండేలా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. మే 1వ తేదీన ఫడ్నవిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసడర్ గా ఉండేందుకు అక్షయ్ కుమార్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే... ఈ కార్యక్రమానికి ప్రచారం చేస్తానని అక్షయ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News