: మ‌రింత ప‌డిపోయిన బంగారం ధ‌ర‌!


అంతర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అంతర్జాతీయ ప్రభావం దేశీ ప్యూచర్స్‌ మార్కెట్‌పై కూడా ప‌డ‌డంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర మ‌రో రూ.51 రూపాయలు త‌గ్గి రూ.28,531గా న‌మోదైంది. ఫ్రాన్స్‌ ఎన్నికల్లో మార్కెట్లకు అనుకూలంగా వ్యవహరించే మాక్రెన్‌ తొలిరౌండ్‌లో విజయం సాధించటం, ఉత్తరకొరియా అనుస‌రిస్తోన్న విధానాల‌తో త‌లెత్తిన‌ యుద్ధ‌ వాతావరణం ప్ర‌స్తుతం కొంత త‌గ్గ‌డం వంటి అంశాలు బంగారం ధ‌ర‌లపై ప‌డి నేల చూపులు చూసేలా చేస్తున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు. మ‌రోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పలు కంపెనీల ప్రోత్సాహకర ఫలితాల ప్రకటన వంటి అంశం డాలరు బలపడేలా చేసిందని, దీంతో బంగారం ధరలు ప‌డిపోతున్నాయ‌ని చెప్పారు.  కామెక్స్‌లో ఔన్స్‌  బంగారం స్వల్ప నష్టంతో 1256 వద్ద ట్రేడవుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News