: కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకోవద్దు.. సైలెంట్ గా ఉండండి: పళనిస్వామి ఆదేశం
కేంద్ర ప్రభుత్వం ఎంత బలమైందో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామకి బాగా అర్థమయింది. కేంద్రంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఏమీ మాట్లాడరాదంటూ తన మంత్రులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు గంటల పాటు జరిగిన తమిళనాడు కేబినెట్ మీటింగ్ లో ఆయన ఈ మేరకు జాగ్రత్తలు చెప్పారు. కేంద్రంతో కయ్యం ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో స్నేహంగా మెలుగుతూ, పనులు చక్కబెట్టుకుందామని తన సహచరులకు చెప్పారు. కేంద్రం అండలేకపోతే... ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా రాదని స్పష్టం చేశారు.