: తనపై వస్తోన్న విమర్శల పట్ల స్పందించిన నారా లోకేశ్
కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై ప్రతిపక్ష పార్టీలు విమర్శల జల్లు కురిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తనపై వస్తోన్న విమర్శల పట్ల నారా లోకేశ్ స్పందించారు. తన పనితీరుతోనే వారికి సమాధానం ఇస్తానని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. తనను తిట్టడానికే జగన్ దీక్ష చేసినట్లుందని అన్నారు. జగన్ దీక్షలో చిత్తశుద్ధి లేదు కాబట్టే, ఆ దీక్షకు రైతులు రాలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాగునీటితో పాటు అన్ని సమస్యలను తగ్గించామని చెప్పారు.