: ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు మంత్రులు సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా వివిధ పోస్టుల స్థాయుల పెంపు, కొత్త పోస్టుల కల్పనలపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరం పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు మద్దతు ధర అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. మరికాసేపట్లో మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వివరించనున్నట్లు తెలుస్తోంది.