: బెనిఫిట్ గాలా లో ప్రత్యేక ఆకర్షణగా సెరెనా విలియమ్స్!
న్యూయార్క్ లో నిర్వహించిన ఓ బెనిఫిట్ గాలా కార్యక్రమంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూయార్క్ 2017 మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ గాలా కార్యక్రమంలో సెరెనా, తనకు కాబోయే భర్త, రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెగ్జిస్ ఒహనియన్ తో కలిసి హాజరైంది. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అయిన సెరెనా, ఆకుపచ్చ గౌన్ ధరించింది. ఎర్రతివాచీపై నడిచి అందరినీ ఆకర్షించింది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన హాలీవుడ్ బ్యూటీలు రకరకాల దుస్తుల్లో ఆకట్టుకున్నారు.