: మూడు రోజులు మాత్రమే.. ‘ ఫ్లిప్ కార్ట్’ సమ్మర్ సేల్!


ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ పేరిట ఆఫర్లు ప్రకటించింది. ‘సమ్మర్ షాపింగ్ డేస్’ పేరిట ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ నేటి నుంచి 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ట్యాబ్లెట్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. సామ్ సంగ్ ఆన్ నెక్స్ట్ మోడల్ ధర రూ.18,490 ఉండగా ఈ ఆఫర్ కింద రూ.14,900కు అందిస్తోంది. మోటో ఎక్స్ ప్లే ఫోన్స్ పై కూడా భారీగానే ఆఫర్లు ప్రకటించింది. మోటో ఎక్స్ ప్లే 16 జీబీ అసలు ధర రూ.16,999 ఉండగా, రూ.11,999కి, 32 జీబీ మోడల్ అసలు ధర రూ.18,499 ఉండగా రూ.13,499 కే అందజేస్తున్నారు. అంతేకాకుండా, ఆపిల్ స్మార్ట్ వాచ్, శామ్ సంగ్ గేర్, మోటో 360 స్పోర్ట్స్ మోడల్స్ పై, లెనోవా యోగా మోడల్ ట్యాబ్స్, ‘ఆపిల్’ ఐ ప్యాడ్స్ పై కూడా ధరలను తగ్గించి, వినియోగదారులకు అందిస్తున్నామని ‘ఫ్లిప్ కార్టు’ పేర్కొంది.

  • Loading...

More Telugu News