: రైతు కన్నీరు పెట్టడం మంచిది కాదు: పవన్ కల్యాణ్


పెట్టుబ‌డుల కోస‌మంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద ప్రభుత్వాలు చూపే శ్ర‌ద్ధ, దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌ల‌పై చూప‌క‌పోవ‌డం వ‌ల్లే రైతులు రోడ్డెక్క‌వ‌ల‌సిన ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయ‌ని జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. క‌ష్టించి పంట‌లు పండించే రైతు క‌న్నీరు పెట్ట‌డం దేశానికి శ్రేయ‌స్క‌రం కాద‌ని, రైతుల క‌ష్టాలు తీర్చాల‌ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆయ‌న త‌మ పార్టీ పేరిట ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. గ‌త ఏడాది క్వింటాల్ మిర్చిధ‌ర 13,500 రూపాయ‌లు ప‌లికినందున‌, ఇప్పుడు క‌నీసం 11,000 రూపాయ‌ల గిట్టుబాటు ధ‌ర‌గా ఇవ్వాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు.  




  • Loading...

More Telugu News