: ప్రభాస్ నటించిన 'వర్షం' సినిమాకు బాలీవుడ్ లో సీక్వెల్!


తెలుగులో ప్రభాస్, గోపీ చంద్, త్రిష నటించిన 'వర్షం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిన ఆ సినిమాను బాలీవుడ్ లో టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో ‘బాఘి’ (పరుగు) పేరుతో రూపొందించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను టైగర్ ష్రాఫ్ పోషించగా, గోపీచంద్ పాత్రను టాలీవుడ్ నటుడు సుధీర్ పోషించాడు. త్రిష పాత్రను శ్రద్ధా కపూర్ పోషించింది. ఈ సినిమా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా కలరియపట్టు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మార్పులు చేసి 2016లో విడుదల చేయగా, బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

 ఇప్పుడు దానికి సీక్వెల్‌ గా 'బాఘి-2' రూపొందుతోంది. ఈ మేరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తొలి భాగాన్ని రూపొందించిన అహ్మద్‌ ఖానే ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. 'బాఘి-2' ఫస్ట్‌ లుక్‌ లో టైగర్ ష్రాఫ్  అభిమానులను అలరిస్తున్నాడు. హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ (రాంబో సిరీస్ హీరో) ను పోలినట్టు కనిపిస్తున్నాడు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2018 ఏప్రిల్‌ 27న విడుదల కానుంది. 

  • Loading...

More Telugu News