: కూలిన సైనిక విమానం.. ఎనిమిది మంది మృతి
కొలంబియా ఆర్మీకి చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఓ సీనియర్ మిలిటరీ అధికారి కూడా ఉన్నట్టు సైనికాధికారులు తెలిపారు. మిలిటరీ బేస్ నుంచి బొగోటాకు బయల్దేరిన ఈ విమానం సెంట్రల్ కొలంబియాలో కూలిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, కొలంబియా అధ్యక్షుడు మాన్యుయల్ సాంటోస్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.