: చంద్రబాబు నివాసంలో ప్రారంభమైన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆయన నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికలు, మహానాడు ఏర్పాట్లతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈమేరకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ కీలక నేతలు పాలుపంచుకుంటున్నారు.